Magazines

ఎస్సీ రోస్టర్‌లో మార్పులు చేస్తే తీవ్రంగా ఉద్యమిస్తాం: మంద కృష్ణ మాదిగ

1 గంట క్రితం

Mandakrishna
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: ఎస్సీ రోస్టర్‌ పాయింట్లలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణలో జనాభా ప్రాతిపదికన మాదిగలకు తగిన వాటా దక్కలేదని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట మంగళవారం రాత్రి జరిగిన ఎంఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రతినిధుల సదస్సులో ఆయన మాట్లాడారు.


ఎస్సీ రిజర్వేషన్లను పెంచి, వర్గీకరణకు అనుగుణంగా మాదిగలకు 14 శాతం వాటా కల్పించాలని డిమాండ్‌ చేశారు. జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్లను పెంచుతామని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని మంద కృష్ణ కోరారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత రోస్టర్‌ సవరణ పేరుతో మరో వివాదానికి తెరతీయడం సరికాదన్నారు. విద్యారంగ సమస్యలపై వచ్చే మార్చిలో ‘ఛలో హైదరాబాద్‌’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్