Magazines

కేసులకు భయపడేది లేదు: రాహుల్‌గాంధీ

1 గంట క్రితం

Rahul Gandhi
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: ఈసీ కార్యాలయం ముట్టడి నేపథ్యంతో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. నాపై ఇప్పటికే 45 కేసులున్నాయనీ, నా లక్ష్యం 100 ఎఫ్‌ఐఆర్‌లని తేలికగా చెప్పారు. కేసులకు భయపడేది లేదనీ, వెనక్కి తగ్గేది లేదనీ, ఆ కేసులను మెడల్స్‌గా భావిస్తానని పేర్కొన్నారు. సీఈసీ పదవికి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందేని పునరుద్ఘాటించారు. మోడీ, అమిత్ షా, మోహన్ భగవత్, జ్ఞానేశ్ కుమార్ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు.


కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో నేడు జన్‌పథ్‌లోని సాగర్ రత్న రెస్టారెంట్‌లో విపక్ష ఎంపీల భోజన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని, 'ఓట్ల దొంగతనం' అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఇదే సమావేశంలో ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ.. 'ఇది లంచ్ మాత్రమే కాదు, ఒక లాంచ్ కూడా కావచ్చు' అని చమత్కరించారు.


భోజన భేటీ అనంతరం, ఎంపీలందరూ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు బయలుదేరారు. ఈ పరిణామాల నేపథ్యంలో, పోలీసులు జంతర్ మంతర్, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్