- పోషణ మాసోత్సవంలో సర్పంచ్ పులి రమేశ్
నవతెలంగాణ-బెజ్జంకి
పౌష్టికాహారం రాజ్యాంగం కల్పించిన హక్కుని..ప్రతి ఒక్కరూ పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ పులి రమేశ్ సూచించారు.బుధవారం మండల పరిధిలోని వడ్లూర్ గ్రామంలోని అంగన్వాడీలో పోషణ మాసోత్సవం నిర్వహించారు. సర్పంచ్ పులి రమేశ్ హజరై మాట్లాడారు.ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు వెచ్చించి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నాయని..తల్లి బిడ్డల ఆరోగ్యవంతానికి పౌష్టికాహారం ప్రాముఖ్యమైందన్నారు. సూపర్‌వైజర్ నాగరాణి, అంగన్వాడీ ఉపాధ్యాయుల సరోజన, మనెమ్మ, ఆశా వర్కర్లు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)