నవతెలం-గాణ హైదరాబాద్: తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు.
పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న వనజాత శిశువు వైద్యానికి అయ్యే ఖర్చుతో పాటు తక్షణ సాయం కింద రూ. 2 లక్షలను బాదిత కుటుంబానికి మంత్రి అందజేశారు. వివరాల్లోకి వెళితే .. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఫణిగిరి గ్రామానికి చెందిన జంపాల మహేశ్ కుమార్, రజిత దంపతులు పుట్టుకతోనే మూగ, బధిరులు. ఇటీవల వారికి జన్మించిన శిశువుకు కూడా ఇదే సమస్య ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్న వయసులోనే సర్జరీ చేస్తే బిడ్డకు మాట, వినికిడి వచ్చే అవకాశం ఉందని, అయితే అందుకు లక్షల్లో ఖర్చవుతుందని తెలిపారు.
ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆ దంపతులు హైదరాబాద్‌లో మంత్రి కోమటిరెడ్డిని బుధవారం కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. వారి పరిస్థితికి చలించిపోయిన మంత్రి, చిన్నారిని చేతుల్లోకి తీసుకుని వారికి ధైర్యం చెప్పారు. తక్షణ వైద్య ఖర్చుల నిమిత్తం వెంటనే రూ. 2 లక్షల రూపాయల సాయాన్ని అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.."మీ చిన్నారి గురించి ఆందోళన వద్దు. ఆ బిడ్డకు మాటలు వచ్చేలా చేసే బాధ్యత నాది. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేనున్నాను" అని వారికి భరోసా ఇచ్చారు.
ఉదారతను చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి
1 గంట క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)