Magazines

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే తోట

57 నిమిషాల క్రితం

MLA Thota
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

డోంగ్లి మండల పరిధిలోని కుర్లా, ఏనాబోర, గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష‍్మీకాంతారావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కనీస మద్దతు ధర గ్రేడ్-A రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,461 ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అదనపు బోనస్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశిత సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు అదనంగా రూ.500 బోనస్ అందిస్తామని, దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని కోరారు.


ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, డోంగ్లి మండల తాసిల్దార్ రంజిత్ కుమార్, ఆర్ఐ సాయిబాబా, కుర్ల, ఎనబోరా, ఇలేగావ్, గ్రామాల సర్పంచులు ఐకెపి ఎపిఎం జగదీష్ కుమార్, డోంగ్లి సింగల్ విండో కార్యదర్శి బాబురావు, డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానంద్ దేశాయ్, ఆ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు బాచావార్ లక్ష్మణ్, కుర్లా గ్రామ మహిళ గ్రామ సంఘం అధ్యక్షురాలు బాయవ్వ, ఎనబోరా మహిళా సంఘం గ్రామ అధ్యక్షురాలు సులోచన, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వరి ధాన్యం రైతులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్