Magazines

మహిళలకు జ్యూట్‌ బ్యాగుల తయారీపై ఉచిత శిక్షణ

1 గంట క్రితం

Free training
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేర్ రూరల్

ఆలేరు మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో కెనరా బ్యాంక్‌ యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా మహిళలకు జ్యూట్‌ బ్యాగుల తయారీలో ఉచిత శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది.ఈ సందర్భంగా జిల్లా వెటర్నరీ, యానిమల్‌ హస్బెండరీ అధికారి, గ్రామీణ అభివృద్ధి ఉపాధి శిక్షణ సంస్థ అడిషనల్‌ డైరెక్టర్‌ డా. కె. రమేష్‌ శిక్షణలో పాల్గొన్న మహిళలకు మోటివేషన్‌ క్లాస్‌ నిర్వహించారు.స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని, శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను ఉపాధిగా మార్చుకోవాలని మహిళలకు సూచించారు. జ్యూట్‌ బ్యాగుల తయారీ ద్వారా ఇంటి వద్దనే ఉపాధి పొందడంతో పాటు, తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకుని ఆదాయం పెంచుకునే అవకాశాలపై అవగాహన కల్పించారు. మహిళలు శిక్షణను పూర్తిగా సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్