నవతెలంగాణ - హైదరాబాద్ : భారతీ ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను 3 నుంచి 10 శాతం వరకు పెంచింది. కొత్త ధరలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. రూ.449 ప్లాన్ రూ.499కి, రూ.699 ప్లాన్ రూ.749కి, రూ.999 ప్లాన్ రూ.1,049కి పెరిగాయి. ధరల పెంపుతో పాటు ప్రతి సిమ్‌కు ఏడాదికి ఒకసారి 5 రోజుల వ్యాలిడిటీతో 5జీబీ డేటా, 60 నిమిషాల కాల్స్, 25 అవుట్‌గోయింగ్ ఎస్‌ఎంఎస్‌లతో ఉచిత అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ను ఎయిర్‌టెల్ అందిస్తోంది.






కామెంట్‌లు (0)