Magazines

నిర్మల్ పోలీస్..మీ పోలీస్ : ఎస్పీ జానకి షర్మిల 

1 గంట క్రితం

Nirmal Police..your police: SP Janaki Sharmila
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ -ముధోల్
నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. ముధోల్ మండలంలోని చింతకుంట గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బుధవారం ఆమె ప్రారంభించారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బ్యాండ్ మేళాలతో ఎస్పీకి స్వాగతం పలికారు. ఆనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడూతూ.. చిన్న గ్రామమైనప్పటికీ సీసీ కెమెరాలు గ్రామస్థులు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం అన్నారు. చింతకుంట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని, మీగితా గ్రామాల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు‌. ఈ సందర్భంగా ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ పనితీరును ప్రత్యేకంగా అభినందించారు.


భైంసా ఎఎస్పీ పత్తిపాక సాయికిరణ్ మాట్లాడుతూ.. సిసి కెమెరాల ఏర్పాటు వల్ల నేరా నియంత్రణకు ఉపయోగపడుతాయని అన్నారు. ఎస్పీ, ఏఎస్పీ, సిఐ, ఎస్ఐలను ఘనంగా సన్మానించారు. అనంతరం పోలీసులు సైబర్ క్రైమ్ పోస్టర్లను విడుదల చేశారు. బాసర ఎస్ హెచ్ ఓ దీపక్, ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్, సర్పంచ్ లక్ష్మీ గంగాధర్, వీడీసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్