- నంబరు ప్లేట్లు లేని వాహనాల్లో తరలిస్తున్న అక్రమార్కులు
నవతెలంగాణ - మల్హర్ రావు
మండలం వల్లెంకుంట, తాడిచెర్ల, మల్లారం, కాటారం మండలం గంగారం, విలసాగర్ గ్రామాల్లోని మానేరు పరీవాహక ప్రాంతాల నుంచి అక్రమార్కులు ఇసుకను అడ్డుఅదుపు లేకుండా తోడేస్తున్నారు. ఎవరికీ చిక్కకుండా పక్కాగా వారికి అనుకూలమైన మార్గాలను ఎంచుకొని యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో పట్టుబడిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా.. అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ఈ గ్రామాల నుంచి పగలు, రాత్రి తేడాలేకుండా డోజర్లతో మానేరును తోడేస్తూ ట్రాక్టర్లలో ఇసుక రవాణా చేస్తున్నారు. కొంత మంది డ్రైవర్లు మరీ నిర్లక్ష్యంగా ఒక చేతితో చరవాణి మాట్లాడుతూ.. ఇష్టారీతినవాహ నాలు నడుపుతున్నారు. అతివేగంతో వెళ్తుండ డంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరికొందరు డ్రైవర్లకు లైసెన్స్ల లేకపోవడం,ఇసుక రవాణా చేసే వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకపోవడం గమనార్హం. అధికారులు పట్టించుకోకపోవడంతోనే అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసు, రెవెన్యూ,పారెస్టు, మైనింగ్ అధికారులు వెంటనే స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.





కామెంట్‌లు (0)