నవతెలంగాణ - హైదరాబాద్: నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మహిళ దారుణహత్యకు గురయ్యారు. తట్టి అన్నారంలో బుధవారం ఉదయం అటు వైపుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కాళ్లు, చేతులు లేని స్థితిలో మృతదేహాన్ని గుర్తించారు. సమీపంలో మద్యం బాటిళ్లు లభించాయి. మహిళపై లైంగికదాడి చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గత నెల 28న ఓయూ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన మహిళ అదృశ్యం కేసుతో దీనికి సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
నాగోల్‌లో మహిళ దారుణహత్య
53 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)