Magazines

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సత్తుపల్లిలో విస్తృత ప్రచారం

1 గంట క్రితం

graduate MLC elections
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

​రానున్న ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సత్తుపల్లి పట్టణంలో గ్రాడ్యుయేట్ల ఓటు నమోదు కార్యక్రమంపై బీఆర్ఎస్ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు పట్టణంలోని పలు విద్యాసంస్థలను సందర్శించి ఉపాధ్యాయులు, అధ్యాపకులతో సమావేశమయ్యారు.


అర్హులైన ప్రతీ ఒక్కరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు పార్టీ నాయకులతో కలిసి ఈ ఓటు నమోదు ప్రచార  పర్యటనలో పాల్గొన్నారు. విద్యాసంస్థల్లో పర్యటించిన వీరు అర్హులైన గ్రాడ్యుయేట్లకు ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.


ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేసే ప్రతి ఓటు ఎంతో కీలకమైనదని కూసంపూడి మహేష్ పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని మహేష్ కోరారు. ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రభుత్వ-ప్రైవేటు ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ నిపుణులు, వైద్యులు, ఇంజినీర్లను గుర్తించాలని బీఆర్ఎస్ నాయకులను కోరారు. అర్హులైన గ్రాడ్యుయేట్లు అందరూ ఓటు నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అర్హులందరి ఓటు నమోదు పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలో సమన్వయంతో నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని మహేష్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎస్కే చాంద్ పాషా, మల్లూరు అంకమరాజు, నడ్డి ఆనందరావు, బెల్లంకొండ రాము, వల్లభనేని పవన్ మేకల నరసింహారావు మారుతి సూరిబాబు, చంటి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్