Magazines

గణేష్ నిమజ్జనానికి రెండు స్థలాలు ఎంపిక

20 సెప్టెంబర్, 2026

ganesh
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 20, 2026 | 1 నిమిషాల చదవడం

•తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు 
నవతెలంగాణ-మర్రిగూడ 
మండలంలో గణేష్ నిమజ్జనానికి రెండు స్థలాలను ఎంపిక చేసినట్టు మర్రిగూడ తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు తెలిపారు. ఆయన ఆదివారం ఎంపీడీవో జిసి మున్నయ్య,మర్రిగూడ ఎస్ ఐ రాంబాబు తో కలిసి మండలంలోని కొన్ని స్థలాలను పరిశీలన చేసి ఫైనల్ గా 1. యరగండ్లపల్లి  కెనాల్ 2. కిష్టరాం పల్లి రిజర్వాయర్ వద్ద ఉన్న ప్రదేశం ను గణేష్ నిమజ్జనానికి సురక్షితంగా ఉంటుందని గుర్తించడం జరిగిందని వారు తెలిపారు.మండల ప్రజలు నిబంధనలు పాటిస్తూ,శాంతియుత వాతావరణంలో ఈ రెండు ప్రదేశాలలో గణేష్ నిమజ్జనాలను జరుపుకోవాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్