Magazines

ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి

1 గంట క్రితం

punished
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

- టీఆర్ఆర్ఎస్ మీడియా జిల్లా కన్వీనర్ జూపల్లి నర్సింలు

నవతెలంగాణ - తొగుట 

రజక జాతి ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే కుట్ర లను తిప్పి కొట్టెందుకు కుల బంధావులు ఏకం కావాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మీడియా జిల్లా కన్వీనర్ జూపల్లి నర్సింలు అన్నారు. మెదక్ పట్టణం ఆటోనగర్ లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను కండించారు.


మంగళ వారం విలేకరు ల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఘటనకు పాల్పడిన దుండగులను పోలీసులు వెంటనే గుర్తించి, సమగ్ర విచారణ జరిపి, చట్టప్రకా రం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె విగ్రహాన్ని ధ్వంసం చేయడం ద్వారా రజకుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే సమాజం సహిం చబోదని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విగ్రహం ధ్వంసం చేసిన ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్