Magazines

చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి 

57 నిమిషాల క్రితం

handloom workers
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 

 చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు, హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ, సంఘం చైర్మన్ దాసి శంకర్  అన్నారు. ఆలేరు పట్టణంలో మంగళవారం   చేనేత సహకార సంఘం సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమం, సభ్యుల సమస్యలు, చేనేత రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు. 


చేనేత కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు సంఘం పాలకవర్గం కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఆలేరు మున్సిపల్ కో ఆప్షన్ మెంబెర్ చింతకింది మురళి  ,చేనేత వైస్ చైర్మన్ చింతకింది రంగా , కార్యదర్శి గాడిపెల్లి రమేష్, కోశాధికారి ఎలగందుల ఉమారుషి, సహాయ కార్యదర్శి బింగి నర్సింహులు, డైరెక్టర్స్ అంకం మల్లేశం, అందె రాములు, ఎలగందుల పద్మ, బేతి భాగ్య, మాజీ కార్యదర్శి ఎలగందుల రామారుషి, మాజీ ఉపాధ్యక్షులు సామల రామనర్సయ్య, పద్మశాలి మండల అధ్యక్షులు సామల సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కర్రె ఎల్లయ్య,పద్మసుదర్శన్, చింతకింది సత్యనారాయణ, చింతకింది రామానుజం, ఎలగందుల లక్ష్మి నారాయణ, రేగోటి వెంకటేష్ చింతకింది సిద్దులు,చింతకింది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్