Magazines

దక్షిణాఫ్రికాకు ఆస్ట్రేలియా షాక్‌..

1 గంట క్రితం

Australia shocks South Africa..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ దక్షిణాఫ్రికాకు ఆస్ట్రేలియా షాక్‌ ఇచ్చింది. డర్బన్‌ టెస్టులో సఫారీలను 214 పరుగుల తేడాతో ఓడించింది. 421 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 206 పరుగులకే కుప్పకూలింది. జోష్‌ హేజిల్‌వుడ్‌ 49 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎడెన్‌ మర్క్‌రమ్‌ (75) అర్ధశతకంతో పోరాడినా జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. మ్యాట్‌ రెన్‌షా కూడా బంతితో రాణించాడు. కింగ్స్‌మీడ్‌ మైదానంలో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా నాలుగో టెస్టు విజయం. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు అక్టోబర్‌ 18న జరగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్