నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలోని ముల్తాన్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. మంగళవారం రైలు పెషావర్ వెళ్తుండగా షేర్ షా రైల్వే స్టేషన్ సమీపంలో 'రెహమాన్ బాబా ఎక్స్‌ప్రెస్' పట్టాలు తప్పింది. ఈ ఘటనలో కనీసం ఆరుగురు మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారని స్థానిక మీడియా నివేదించింది. ఈ ప్రమాదాన్ని పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి ధృవీకరించారు.
పాకిస్తాన్‌లోని ప్రముఖ దినపత్రిక 'డాన్' నివేదిక ప్రకారం, ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు అబ్బాసి ఫెడరల్ గవర్నమెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ రైల్వేస్ (FGIR)ను నియమించారు. లోకో పైలట్ రిజ్వాన్ అబ్బాస్ మాట్లాడుతూ,..గంటకు 100 కిలోమీటర్ల వేగంతో షేర్ షా స్టేషన్ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు తనకు అకస్మాత్తుగా కుదుపు తగిలిందని, రైలును ఆపడానికి తాను అత్యవసర బ్రేకులు వేసినట్లు తెలిపారు.







కామెంట్‌లు (0)