నవతెలంగాణ-ఆలేరు టౌను
గొర్రెలు మేకలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని, మందల వద్దకు పశువైద్యులు వెళ్లాలని, జిఎంపిఎస్, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దెపురం రాజు డిమాండ్ చేశారు. ఆలేరు పట్టణంలో గురువారం పశువైద్యశాల వద్ద , శ్రీనివాసపురంలో ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి గొర్రెలు మేకలకు మందల వద్ద ఉచిత వైద్య సేవలు అందించాలని ధర్నా నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవాలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన అన్ని రకాల మందులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
శ్రీనివాసపురం గ్రామంలో పదేండ్ల కింద గొర్రెల పెంపకందారులు సంఘం రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తున్నారని,గొర్రెలకు వ్యాధులు సోకిన సమయంలో ప్రైవేట్ మందుల షాపులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పశువైద్యులు మందల వద్దకు వెళ్లి,ప్రతి గొర్రెల మందను పరిశీలించేలా చర్యలు చేపట్టాలని కోరారు.గొర్రెలకు వ్యాధి నిర్ధారణ, టీకాలు, డీవార్మింగ్, మందులు తదితర సేవలను పూర్తిగా ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. గొర్రెల పెంపకందారుల ప్రధాన జీవనోపాధిని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి,మందల వద్ద ఉచిత పశువైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.
అనంతరం వెటర్నరీ డాక్టర్ చైతన్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు వడ్ల నాగయ్య, కోశాధికారి పోతారం కనకయ్య, చౌడబోయిన మహేష్,గాదె అంజయ్య,ప్రసాద్,రాములు, ముకుందం,అయిలమ్మ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)