Magazines

ప్రజావాణికి ఆరు దరఖాస్తులు

49 నిమిషాల క్రితం

Prajavani
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరురూరల్ 

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరై ప్రజల నుంచి సమస్యలు, వినతులను స్వీకరించారు.అందిన దరఖాస్తులను పరిశీలించి,సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా మొత్తం ఆరు దరఖాస్తులు స్వీకరించారు.ఇందులో రెవెన్యూ శాఖకు01,మున్సిపాలిటీకి 01, విద్యుత్ శాఖకు 01,ఐ అండ్‌ క్యాడ్‌కు01, మైనింగ్ శాఖకు 01, లా శాఖకు 01 చొప్పున దరఖాస్తులు అందాయి.ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్