Magazines

ఓటుకు నోటు కేసులో కీలక మలుపు

1 గంట క్రితం

Supreme Court
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులోని ప్రధాన ఫిర్యాదుదారు, నామినేటెడ్ మాజీ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసు విచారణలో భాగంగా అదనపు వాదనలు వినిపించేందుకు తనకు అవకాశం కల్పించాలని స్టీఫెన్‌సన్ తన పిటిషన్‌లో కోరారు.


2015 జూన్‌లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసేందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి (ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి) రూ. 50 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసి రేవంత్ రెడ్డి సహా ముగ్గురిని అరెస్ట్ చేయడంతో పాటు నగదును స్వాధీనం చేసుకుంది.


తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్వాష్ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న తరుణంలో స్టీఫెన్‌సన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తదుపరి విచారణలో ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్