Magazines

వెంకటేష్‌ " ఆదర్శ కుటుంబం" వాయిదా..

1 గంట క్రితం

Adarsh ​​Kutumbham
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆదర్శ కుటుంబం' సినిమా విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 9న థియేటర్లలోకి రావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించిన తుది దశ పనులు ఇంకా పూర్తి కాలేదనీ, మరో రెండు, మూడు పాటల చిత్రీకరణతో పాటు, కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ కూడా మిగిలి ఉందన్నారు. ఈ పనులన్నీ పూర్తి చేయడానికి కనీసం రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చిత్ర బృందం మిగిలి ఉన్న పనులను వేగంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమైందని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్