ఎంపీడీవో కుమార్, తహసిల్దార్ చందా నరేష్
నవతెలంగాణ-నెల్లికుదురు
మండల కేంద్రంలోని ప్రతి సోమవారం నిర్వహించి గ్రీవెన్ సెల్లుకు నాలుగు దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో సింగారం కుమార్ తహసిల్దార్ చందా నరేష్ తెలిపారు. సోమవారం గ్రీవెన్ సెల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సోమవారం గ్రీవెన్స్ సెల్ కు పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కు ఒక దరఖాస్తు రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఒక దరఖాస్తు మరియు ఇరిగేషన్ కు ఒక దరఖాస్తు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు ఒక దరఖాస్తు మొత్తం నాలుగు దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించి గ్రీవెన్స్ సెల్లుకు ఓ శాఖ అధికారి ఎప్పటికి లేటు అవడంతో షోకాజు నోటీస్ జారీ చేసినట్లు వారు తెలిపారు. అంతేకాకుండా ఐదు శాఖల అధికారులు కూడా 10 గంటలకు రావాల్సిన అధికారులు 10 గంటల 20 నిమిషాలు దాటిన తర్వాత హాజరైనర్ చెప్పారు. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్ సెల్లుకు టైం కు వివిధ శాఖల అధికారులు అందరూ హాజరుకావాలని కోరినట్లు చెప్పారు.







కామెంట్‌లు (0)