Magazines

లో వోల్టేజ్ సమస్యను వెంటనే పరిష్కరించాలి

49 నిమిషాల క్రితం

voltage problem
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 2 నిమిషాల చదవడం

రైతులకు అనుగుణంగా కరెంటు అందించడంలో విద్యుత్ అధికారులు విఫలం

తెలంగాణ రైతు  సంగం సంఘం జిల్లా నాయకుడు తోట నరసయ్య, బాణాల యాకన్న 

నవతెలంగాణ-నెల్లికుదురు

మండలంలోని అన్ని గ్రామాలలో లో వోల్టేజ్ సమస్య తీవ్రంగా ఉందని లో వోల్టేజ్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు తోట నరసయ్య బాణాల యాకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. నైనాల గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్త్ కు నీళ్లు పోసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  వర్షాభావ పరిస్థితుల వల్ల పంటకు నీరు సమృద్ధి లేకపోవడంతో రాత్రి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. విద్యుత్తు పూర్తి స్థాయిలో లేక మోటార్లు నడిచే పరిస్థితి లేదని తెలిపారు. వర్షాలు పూర్తిస్థాయిలో పడకపోవడం తో నీరు సరిగా లేకపోవడంతో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ కు పూర్తిస్థాయిలో ఎర్త్ సపోర్ట్ చేయకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ ట్రిప్ అవుతుందని అన్నారు. విద్యార్థులు అధికారుల ఆదేశాల మేరకు నీరును పోసే కార్యక్రమాన్ని నిర్వహించారు.


చేతికి అంది వచ్చిన వరి పత్తి రైతుల కు వేసిన పంటకు నీరు లేక తీవ్రంగా నష్టపోతున్నారు అని అన్నారు. బావులు క్రింద బోర్ల కింద ప్రస్తుతం 70 శాతం మంది రైతులు నీటిపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు అని తెలిపారు.ప్రస్తుత వ్యవసాయానికి అనుగుణంగా రైతులకు కరెంటు అందించడంలో విద్యుత్ శాఖ విఫలం మవుతుందని రైతు సంఘ నాయకులు తోట నరసయ్య బాణాలయా కన్నా అన్నారు.. లో వోల్టేజ్ సమస్య వల్ల రైతుల విద్యుత్తు మోటర్లు కాలిపోయి రైతులు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు .పండే పంట కన్నా లో వోల్టేజ్ సమస్య వల్ల రైతుల ఆవేదన వర్ణనాతీతంగా ఉందని అన్నారు, నేనాల గ్రామంలోని ఇఫ్తారి పొలంలో గల 100wt ట్రాన్స్ఫారం క్రింద గల వ్యవసాయ పంప్ సెట్స్ గత వారం రోజులుగా మొరాయించడం వలన పంటలు ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నాయని తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని లేనియెడల రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  రైతులు బాణాల యకన్నా, తోట నరసయ్య, జాగిరి బుచ్చాలు, ప్రవీణ్ ,అనిల్, తోట శీను, ఇస్తారు ,కొమురయ్య, చిర్ర సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్