Magazines

కొయ్యుర్ లో వన్యప్రాణుల వారోత్సవాలు

46 నిమిషాల క్రితం

Wildlife Week
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

తెలంగాణ ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుండి 7 వరకు నిర్వహిస్తున్న వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా కొయ్యూరు పారెస్టు రేంజ్ అధికారులు ఆధ్వర్యంలో సోమవారం కొయ్యుర్  గ్రామ పంచాయతీ వద్ద అవగాహన కార్యక్రమాన్ని సర్పంచ్ కొండ రాజమ్మ అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎండి ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడారు వన్యప్రాణులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, అడవిని రక్షిస్తేనే భవిష్యత్తు తరాలు సురక్షితంగా ఉంటాయన్నారు.అడవిలో వేటాడటం,చెట్లు నరకడం,మంటలు పెట్టడం నేరమని,అటువంటివి ఎక్కడైనా కనిపిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1800-425-5364 కు సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రుద్రారం నర్సయ్య, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ స్వరూప, బీట్ ఆఫీసర్లు మహేందర్, శ్రీతేజ,ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్