సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో నిరసన
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు
నవతెలంగాణ-నెల్లికుదురు
మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ గదులు అద్వానమైన పరిస్థితిలో ఉన్నాయని వాటిని ఉపయోగంలోకి తీసుకురావడానికి తగు చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బస్టాండ్ ప్రాంతంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్టాండులో మహిళలు విద్యార్థిని విద్యార్థులు ముత్రశాలలు సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
మండల కేంద్రానికి వివిధ గ్రామాల నుండి వేల మంది వివిధ రకాల పనుల నిమిత్తం వస్తువు పోతుంటారని. కనీసం మూత్ర విసర్జన చేయడానికి కూడా వసతి లేని ప్రాంతం బస్టాండ్ ఉండడం ఎంతో బాధాకరమని అన్నారు. వివిధ గ్రామాల నుండి విద్యను అభ్యసించడానికి వందలాది మంది వస్తున్నారని కనీసం వారికి మౌలిక వసతులు కల్పించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని అన్నారు. పక్కన ఉన్న కాలేజీ గ్రౌండ్లో మూత్ర విసర్జన చేసుకోవలసిన పరిస్థితి వస్తుందని తెలిపారు. అలా మూత్ర విసర్జన చేయడం వలన దుర్వాసన వస్తుండడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తక్షణమే అధికారులు స్పందించి నిర్మాణం చేపట్టాలని లేనియెడల ప్రజలతో విద్యార్థిని విద్యార్థులతో ఆందోళన కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పవన్ సిద్దు వంశీ విక్రమ్ సన్నీ భాను ప్రసాద్ జస్వంత్ విజయ్ యశ్వంత్ అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)