Magazines

హెచ్ఐవి పై కళాజాత బృందం అవగాహన

48 నిమిషాల క్రితం

HIV
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆసిఫాబాద్ 

హెచ్ఐవి వ్యాప్తి నివారణపై కళాజాత బృందం చే జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణం ఆవరణలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారి సిడాం నాగేంద్ర జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవి అనేది బాధితుల శరీర ద్రవాల ద్వారా మాత్రమే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందన్నారు. వైరస్ ఉన్న రక్తాన్ని ఎక్కించడం ద్వారా, డ్రగ్స్ వాడేటప్పుడు లేదా ఒకరు ఉపయోగించిన సూదులు, సిరంజీలను మరొకరు వాడటం ద్వారా, గర్భధారణ సమయంలో, ప్రసవ సమయంలో లేదా తల్లిపాల ద్వారా సోకే అవకాశం ఉందన్నారు. వ్యాధి నివారణకు పద్మ ఆధ్వర్యంలోని కళాజాత బృందం ద్వారా అవగాహన కలిగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఓ ఎన్ సి డి వెంకటేష్, ఎస్ ఓ రమేష్ చంద్ర, డిపిఓ వెంకటేష్, హెచ్ఐవి కోఆర్డినేటర్ శ్యామ్ లాల్, సూపర్వైజర్ ఉత్తమ్, ఐ సి టి సి కౌన్సిలర్ సతీష్, డి ఎం డి ఓ సంతోష్, టిఐఎన్జీవో సభ్యులు వెంకటేష్ వికాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్