Magazines

ఏసీబీ వలలో రంగారెడ్డి డీఎంహెఓ

57 నిమిషాల క్రితం

ACB
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో లంచాల పర్వం బట్టబయలైంది. రూ. లక్ష లంచం తీసుకుంటూ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ స్వర్ణ కుమారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. నగరంలో ఓ నూతన ఆస్పత్రిని ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులు (ప్రాసెస్) మంజూరు చేయడం కోసం డీఎంహెచ్‌వో స్వర్ణ కుమారి రూ. లక్ష లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, వారు పక్కా వ్యూహంతో రంగంలోకి దిగారు. బాధితుడి నుంచి లంచం డబ్బులు స్వీకరిస్తుండగా ఏసీబీ బృందం దాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్