Magazines

ఇంటిగ్రేటేడ్ పాఠశాలల నిర్మాణాలపై ప్రజావాణిలో ఫిర్యాదు

1 గంట క్రితం

integrated schools
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటేడ్‌ పాఠశాలలకు సరిపడా నీళ్లు వాడకుండా నిర్మిస్తున్నారని టీఆర్ఎస్ జుక్కల్‌ నాయకులు సంజీవ్‌ మాదిగ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకై నిర్మిస్తున్న పాఠశాలలు నాణ్యత లేకుండా తూతూ మంత్రగా చేపడుతున్నారనీ, ఆ పనులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు అక్కడ బోర్లు వేసినా నీళ్లు పడటం లేదనీ, భవనాలు నిర్మించే సమయంలో తగినంత నీరు వాడకపోతే నాణ్యత లోపించి, కూలిపోయే ప్రమాదం ఉందనీ, ప్రభుత్వం వందల కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న పాఠశాలలు, ప్రజా ధనం వృధాకాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు బండి హనుమాన్లు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్