Magazines

కామారెడ్డి వద్దు.. నిజామాబాదే ముద్దు

4 గంటల క్రితం

madnoor
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

జిల్లా మర్పుకై మద్నూర్‌ మండల ప్రజల ఎదురుచూపు

నవతెలంగాణ - మద్నూర్‌
మద్నూర్‌ మండలాన్ని కామారెడ్డి జిల్లా నుంచి నిజామాబాద్‌ జిల్లాలో కలపాలని మండలంలోని గత నెల దాదాపు 20 మందికి పైనే ప్రజావాణిలో వినతి పత్రాన్ని సమర్పించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఓ సర్క్యులర్‌ కూడా జారీ చేశారు. దీనిని ఆర్‌డీఓ, తహశీల్దార్‌ కార్యాలయంలో కూడా అందజేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జిల్లాల ఏర్పాటు జరగడం మంచిదే అయినా ఒక్క మద్నూర్‌ మండలానికే అన్యాయం జరిగిందని ప్రజలు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనలు కూడా చేపట్టారు. ప్రస్తుతం ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నైనా మండల ప్రజలు ఆకాంక్ష‍లు నెరవేరుతాయా లేదా అని అయోమయానికి గురవుతున్నారు.


మద్నూర్‌ మండలాన్ని నిజామాబాద్‌లో కలపడం వల్ల దాదాపు 40 దూరం తక్కువౌతుందనీ, దీంతో పాటు సమయం కూడా కలిసొస్తుందని ప్రజాభిప్రాయం వ్యక్తమవుతోంది. మద్నూర్‌ నుంచి కామారెడ్డికి దాదాపు 110 కిలోమీటర్ల దూరం ఉందనీ, రాష్ట్రంలోని అన్ని మండలాలకు జిల్లా కేంద్రం దగ్గరగా ఉందనీ, మద్నూర్‌కు మాత్రమే వంద కిలోమీటర్లకు పైగా ఉందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మద్నూర్‌ మండలాన్ని నిజామాబాద్‌లో విలీనం చేసి, ప్రజల ఆశలు, ఆకాంక్ష‍లు నెరవేర్చాలని మండల ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్