Magazines

రేవంత్ రెడ్డి హాయంలో ప్రజా సంక్షేమం

43 నిమిషాల క్రితం

mla
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

- ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం భూమి పూజ,  లబ్ధిదారులకు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ, లో ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు

నవతెలంగాణ-మద్నూర్

కాంగ్రెస్ పార్టీ పుట్టిందే గరీబోళ్ల కోసం ప్రజా పాలన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాయంలో ప్రజా సంక్షేమమని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు తెలిపారు. మండలంలోని శాఖాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆ గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో కొనసాగినప్పటికీ గరీబోళ్ల కోసం ఏ ఒక్కరికి రేషన్ కార్డు అందించలేదన్నారు. గరీబోళ్ల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అర్హులైన వారికి రేషన్ కార్డులు అందించడం జరిగిందని, అర్హులైన వారికి గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇండ్లు నిర్మించిస్తుందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ వరి ధాన్యం రైతులకు బోనస్ గ్రామాల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన సంక్షేమ పథకాల అమల్లో కాంగ్రెస్ పార్టీ కే ఘనత దక్కుతుందని ఎమ్మెల్యే అన్నారు

.

కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పిలుపు ఇచ్చిన ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపును విజయవంతం చేయాలని, కాంగ్రెస్ పార్టీలో కట్టుబడి పని చేసిన వారికి గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి రాబోయే కాలంలో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాఖాపూర్ సర్పంచ్ తుకారం ఉప సర్పంచ్ పంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామ కార్యదర్శి సంగీత మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాయిలు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షులు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్