నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 97శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 115 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 34,889 ఓట్లలో 33,973 ఓట్లు పోలయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో 98శాతం, కరీంనగర్‌లో 97శాతం పోలింగ్ నమోదైంది. ఏ యూనియన్ విజయం సాధిస్తుందో అర్ధరాత్రికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల్లో గెలుపుపై ఈ నెల 17న అధికారిక ప్రకటన వెలువడనుంది.
ముగిసిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)