Magazines

బాలికల జూనియర్ కళాశాలలో 'ఫ్రెషర్స్ డే' వేడుక

57 నిమిషాల క్రితం

sathu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ-సత్తుపల్లి 

​సత్తుపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు, ప్రథమ సంవత్సర విద్యార్థినులకు ఘనంగా స్వాగతం పలికారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో కళాశాలలో చేర్పించారని, వారి ఆశలను వమ్ము చేయకుండా క్రమం తప్పకుండా రావాలన్నారు. బాగా చదువుకుని సమాజంలో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాల్లో నిలవాలని ఆమె ఆకాంక్షించారు. ఇంటర్మీడియట్ వయసు చాలా కీలకమైనదని, చెడు అలవాట్లు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.విద్యార్థులు మంచి మార్గంలో నడుస్తూ తమ తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అమ్మ ఆదర్శ పాఠశాల చైర్‌పర్సన్ ఎం. జానకి మాట్లాడుతూ విద్యార్థులు నేటి సమాజానికి నవనిర్మాతలు కావాలన్నారు. ఉజ్జ్వల భవిష్యత్తుకు విద్యార్థులే పునాది వేసుకుంటూ, భావి భారత ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు లలితమ్మ, ప్రమీల, వనజరాణి, కల్పన, సత్యనారాయణ, కృష్ణవేణి, రాణి, శిరోమణి, సమ్మక్క, శ్వేత, వెంకటేశ్వరరావు, సౌజన్య, సీత, వెంకటేష్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్