Magazines

నారాయణ' పాఠశాలలో ఘనంగా ‘బతుకమ్మ’ సంబురాలు

55 నిమిషాల క్రితం

naryan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమైన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని సత్తుపల్లిలోని నారాయణ పాఠశాలలో శుక్రవారం బతుకమ్మ సంబురాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పూలపండుగ విశిష్టతను ప్రతిబింబించేలా పాఠశాల ప్రాంగణమంతా రంగురంగుల పూల శోభతో, పండుగ వాతావరణంతో కళకళలాడింది.​ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి, రకరకాల పూలతో అందమైనబతుకమ్మలను పేర్చారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ, సంప్రదాయ నృత్యాలతో ప్రాంగణంలో సందడి చేశారు. తల్లిదండ్రులుసైతం ఈ సంబురాలలో భాగస్వాములై వేడుకలకు మరింత శోభను తెచ్చారు. ​

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రామమూర్తి మాట్లాడుతూ...విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతలను తెలియజేయడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఇలాంటి వేడుకలు పిల్లల్లో ఐక్యతాభావాన్ని, సామాజిక స్పృహను, మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం రామ్‌కీ, ఆర్‌ఐ క్రాంతి, కో-ఆర్డినేటర్లు వినోద లక్ష్మి, నీలిమ, వైస్ ప్రిన్సిపాల్స్ రమ్య, దివ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్