Magazines

జీవశాస్త్ర ఒలింపియాడ్ అధ్యాపకుల సమావేశం

1 గంట క్రితం

Biology Olympiad
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - మల్హర్ రావు

బొంబాయి నగరంలోని హోమి బాబా సైన్స్ ఎడ్యుకేషన్ సెంటర్, అణుశక్తి నగర్ ఐదు రోజులపాటు విస్తృత పరిశోధన తరగతులు నిర్వహించారు. భారత కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారతీయ యువతలో నవ్య అన్వేషణతో కూడిన నూతన పరిశోధనలను అంతర్జాతీయ స్థాయి ఒలింపియాడ్ పరీక్షలో విజయం సాధించడం కోసం జాతీయ సమన్వయకర్తగా టాటా ఫండమెంటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్  (టిఐఎఫ్ ఆర్) వారి సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రాల నుండి కణ జీవశాస్త్రము, అణు జీవశాన్ని ప్రత్యేకంగా చదివిన అధ్యాపకులను ఎంపిక చేసి ఉచిత వసతి, రవాణా సౌకర్యాలు కల్పించి సదస్సుకు హాజరైన అధ్యాపకులకు ప్రయోగ విధానాలు నేర్పించి సైన్స్ లోని వినూత్న పోకడలను ప్రయోగికంగా తెలియజేసి విజ్ఞానాన్ని విస్తృత పరిచారు.


ఈ కార్యక్రమంలో వివిధ ఐఐటీల శాస్త్రవేత్తలు మరియు హోమీబాబా నేషనల్ సైన్స్ సెంటర్ యొక్క ప్రొఫెసర్స్ అనుపమ, రేఖావర్తక్, మయూరి రెడ్జే. ఆల్ ఇండియా బయాలజికల్ సైన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ శివకుమార్ మీనన్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి మండలం ఎడ్లపల్లి గ్రామంలోని  సనుగోజు సతీష్ స్నాత కోత్తర అధ్యాపకులు హాజరయ్యారు.విస్తృతమైన శిక్షణలో పాల్గొని జీవశాస్త్రంలో ఆధునిక జ్ఞానాన్ని సంపాదించారు.ఇట్టి విజ్ఞానం తమ పాఠశాల,కళాశాల పిల్లలకి బోధించుటలో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ఎంపికైనందుకు టీబీఎస్ఎఫ్ ఫోరం అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి,కార్యదర్శి రాధాకృష్ణ,ప్రిన్సిపల్ పూర్ణచంద్రరావు, గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ సహచర అధ్యాపకులు అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్