నవతెలంగాణ - హైదరాబాద్: ప్రముఖ నటుడు నానా పటేకర్ మృతికి సంబంధించిన సస్పెన్స్‌కు తెరపడింది. ఆయన మరణం సహజమైనదేనని, తీవ్రమైన గుండెపోటు కారణంగానే ప్రాణాలు కోల్పోయారని తుది పోస్ట్‌మార్టం నివేదిక స్పష్టం చేసింది. గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (GMCH) వైద్యుల బృందం ఈ నివేదికను గోవా పోలీసులకు అందజేసింది. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన ధమనిలో రక్తం గడ్డకట్టడంతో గుండెపోటు సంభవించి నానా పటేకర్ మరణించారు. పోస్ట్‌మార్టం నివేదిక వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేయగా, వారు కూడా అంగీకరించారని, ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని పోలీసులు పేర్కొన్నారు.





కామెంట్‌లు (0)