Magazines

సిరిసిల్లలో శాశ్వత క్యాంపస్ నిర్మాణం చేపట్టండి: కేటీఆర్

1 గంట క్రితం

KTR
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ- హైదరాబాద్‌: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కళాశాల శాశ్వత క్యాంపస్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి.. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.


2021లో రూ.402 కోట్ల పరిపాలనా అనుమతులతో మంజూరైన జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల శాశ్వత క్యాంపస్ నిర్మాణం ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నదని పేర్కొన్నారు. మండేపల్లి గ్రామంలో 20 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ, నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో కళాశాల ప్రస్తుతం అగ్రహారంలోని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో తాత్కాలికంగా కొనసాగుతున్నదని తెలిపారు. కళాశాలను ప్రస్తుత ప్రాంగణం నుంచి మరో ప్రైవేటు భవనానికి తరలించే ప్రతిపాదనలు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.


ఈ నేపథ్యంలో మండేపల్లిలో కేటాయించిన స్థలంలో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేయాలని కోరారు. అలాగే.. కొత్త క్యాంపస్ పూర్తయ్యే వరకు కళాశాలను ప్రస్తుత ప్రాంగణంలోనే కొనసాగించేందుకు అనుమతించాలని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్