Magazines

ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రులు

1 గంట క్రితం

dasara
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు పది రోజుల పాటు కనకదుర్గమ్మ పది రకాల విశేష అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజైన నేడు అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు.

అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్