నవతెలంగాణ-వర్ధన్నపేట
వర్ధన్నపేట పట్టణంలోని1వ వార్డుకు చెందిన రెడ్డిమల్ల లక్ష్మీ ఇటీవల మరణించగా, ఆమె దశదిన కర్మ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజు, హన్మకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ షీభారాణి రాజేందర్, కౌన్సిలర్లు పాపారావు, వాణి కుమారస్వామి, మండల అధ్యక్షులు పోశాల వెంకన్న గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు ఏద్దు సత్యనారాయణ, దేవస్థానం చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఇల్లంద ఏఎంసీ చైర్మన్ నరకుడు వెంకటయ్య, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మల్లెపాక సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పత్రి భాను ప్రసాద్, నాయకులు తుల్ల రవి, అయిత సుధాకర్, సమ్మెట సుధీర్, మహమ్మద్ అప్సర్, పులి శ్రీనివాస్, కొండేటి బాలకృష్ణ, మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)