నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని కొట్టాల గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా శనివారం గ్రామ పంచాయితీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ కల్లెట్ల లింగయ్య, పాలకవర్గం సమక్షంలో గ్రామపంచాయతీ కార్మికులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి నగదు ప్రోత్సాహంతో పాటు, కొత్త బట్టలను, గ్రామపంచాయతీ అవసరాల నిమిత్తం మోటర్ బైకును అందజేశారు. అదే విధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శిని కూడా శాలువాతో సన్మానించి, కొత్త బట్టలను అందజేశారు. గ్రామ పారిశుధ్యంలో ప్రథమ పాత్ర పోషిస్తున్న మల్టీ పర్పస్ కార్మికుల సేవలను గుర్తించి వారిని ఘనంగా సన్మానించినందుకు గ్రామ సర్పంచ్ కల్లెట్ల లింగయ్యను పలువురు అభినందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ జనగాం నరసమ్మ, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)