అందులో భాగంగానే చెంతుల తరలింపు ప్రక్రియ
రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలి.
పౌర హక్కుల సంఘం నాయకులు డిమాండ్.
నవతెలంగాణ అచ్చంపేట : నల్లమల్ల అడవిది యురేనియం కంపెనీకి అప్పగించేందుకు భారీ కుట్ర జరుగుతుందని అందులో భాగంగానే చెంచు పెంటల తరలింపు ప్రక్రియ జరుగుతుందని ఈ విషయం పైన రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని పౌరాకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ లక్ష్మణ్ , ప్రధాన కార్యదర్శి నారాయణరావు లు అన్నారు. శనివారం పట్టణంలోని తెలంగాణ గజిటెడ్ అధికారుల భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు శుక్రవారం, శనివారం రెండు రోజులు అటవీ ప్రాంతంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ పర్యటించిందన్నారు. ప్రజల అభిప్రాయాలను సేకరించినట్లు తెలిపారు. వటువర్ల పల్లి , సార్లపల్లి ,రాయలేటి పెంట, మరికొన్ని పెంటలలో చెంచులతో పాటు ఇతర నాన్ ట్రైబల్ వారు నివాసం ఉంటున్నారు. రీ లొకేషన్ పేరుతో అటవీ శాఖ అధికారులు చెంచుపెంటలను తరలించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
కొల్లాపూర్ డివిజన్లోని బాచారం వద్ద 250 గజాలలో ఇంటి ఇంటి నిర్మాణం ఐదు ఎకరాల భూమి ఇస్తున్నట్లు అటల్ శాఖ అధికారులు చెంచులకు, నాన్ ట్రైబల్ వారికీ చెబుతున్నారు. రీ లొకేషన్ కు అధిక సంఖ్యలో చెంచులు వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితులను మా భూమిని , మా అడవిని, అటవీ సంపదను వదిలి ఎక్కడికి వెళ్ళమని చెంచులు బహిర్గతంగా చెప్పినట్లు వారు తెలిపారు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే పాములను తీసుకొచ్చి ఇంట్లోకి వదులుతామని పులులను దాడికి పంపిస్తామని అటవీశాఖ అధికారులు చెంచులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, బెదిరిస్తున్నట్లు చెంచులు చెప్పినట్లు వారు అన్నారు. చెంచు పెంటలను ఖాళీ చేయించాలనే ఉద్దేశంతోనే మౌలిక వసతులు నీళ్లు, కరెంటు, మొదలైన మౌలిక వసతులను నిలిపివేశారని ఎందుకు నిలిపివేశారని...?
ప్రజలు ధర్నా చేస్తే 20 మంది పైన అక్రమ కేసులు బనాయించినట్లు వారు తెలిపారు. చెంచుపేటలో తరలించాలంటే... పేసా చట్టం ప్రకారం గ్రామసభ తీర్మానం కచ్చితంగా చేయాలి. కానీ దొంగ సంతకాలతో , దొంగ గ్రామ కమిటీ ఒప్పందాలతో సంతకాలు చేయించారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది స్లాబ్ పై పెచ్చులు ఊడి పడుతున్నాయి ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని భయంధారులకు గురవుతున్నారు. రాష్ట్ర విద్య కమిషన్ కమిటీ ఏం చేస్తుందని వారు ప్రశ్నించారు.
బాచారంలో కూడా కొన్ని వేల చెట్లను నరికివేసి అటవీ భూమినే ఇస్తున్నారని అన్నారు. ఆ సహాయం ఏదో.. సార్లపల్లి, వటువర్ల పల్లి, రాయలేటి పెంట, ఇతర చెంచు పెంటలలో ఇక్కడే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే రద్దు చేయాలన్నారు. నిలిపివేసిన మౌలిక వసతులు త్రాగు నీరు, కరెంటును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో పోరాకుల సంఘం రాష్ట్ర నాయకులు రమేష్ చందర్ జక్క బాలయ్య తిరుమలయ్య సభ్యులు వెంకటేష్, లక్ష్మీనారాయణ.





కామెంట్లు (0)