నవతెలంగాణ_బొమ్మలరామారం
గ్రామ అభివృద్ధిలో విద్యార్థుల భాగస్వామ్యం ఉండాలని, అవగాహన కలిగి ఉండాలని సర్పంచ్ సంగీ గణేష్ అన్నారు.మండలంలోని మర్యాల గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులతో బాలల గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామసభలో పాల్గొని గ్రామ సమస్యలు, బాలల హక్కులు, విద్య, పరిశుభ్రత తదితర అంశాలపై చర్చించారు. గ్రామ అభివృద్ధిలో విద్యార్థుల భాగస్వామ్యం ఉండాలని, చిన్నతనం నుంచే సామాజిక బాధ్యతపై అవగాహన కలిగి ఉండాలని నిర్వాహకులు సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు నిర్మల జ్యోతి,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గడ్డం అశ్రీత దేవి,ఉప సర్పంచ్ ఈదులకంటి శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు,అంగన్వాడి టీచర్ లు, ఆశ వర్కర్లు గ్రామస్తులు,విద్యార్థులు పాల్గొన్నారు.
మర్యాలలో విద్యార్థుల బాలల గ్రామసభ
53 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)