- మూడు రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపు
నవతెలంగాణ – రామకృష్ణాపూర్
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ రాజీవ్ చౌక్ వద్ద కల్వర్టు నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు వాహనాల రాకపోకలను మళ్లించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వాహనదారులకు పలు సూచనలు చేశారు.
రామకృష్ణాపూర్ నుంచి గోదావరిఖనికి వెళ్లే వాహనదారులు సింగరేణి ఏరియా ఆస్పత్రి మార్గాన్ని వినియోగించకుండా, ప్రత్యామ్నాయంగా ఆర్కే-4 గడ్డ రోడ్డు మీదుగా గోదావరిఖనికి చేరుకోవాలని సూచించారు. కల్వర్టు నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు ఈ మార్గాన్ని అనుసరించి సహకరించాలని కోరారు. నిర్మాణ పనుల నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలని మున్సిపల్ అధికారులు సూచించారు.






కామెంట్‌లు (0)