Magazines

600 మంది దీక్షాధారులకు అన్నప్రసాద వితరణ

24 నిమిషాల క్రితం

Annaprasadam
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

- అన్న ప్రసాద నిర్వహణకు బిజెపి జాతీయ నాయకులు పొంగులేటి సుధాకరరెడ్డరూ. 25,116 విరాళం అందజేత 

నవతెలంగాణ-సత్తుపల్లి 

​శ్రీ హరిహరాత్మజ అయ్యప్ప స్వామి దేవాలయంలో గురువారం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మైలవరపు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని, 600 మంది అయ్యప్ప దీక్షాధారులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.


​ఈ సందర్భంగా పొంగులేటి సుధాకరరెడ్డి మాట్లాడుతూ... ఇంతమంది అయ్యప్ప భక్తుల నడుమ ప్రత్యేక పూజల్లో పాల్గొనడం, అన్నప్రసాద వితరణ చేయడం భగవంతుడు తనకు ఇచ్చిన గొప్ప భాగ్యమన్నారు. ఆలయ అన్నప్రసాద కార్యక్రమానికి తన వంతు విరాళంగా రూ. 25,116 అందజేశారు. అనంతరం అన్నప్రసాద దాతలు పొంగులేటి సుధాకరరెడ్డి, మైలవరపు సత్యనారాయణలను ఆలయ గౌరవాధ్యక్షులు, గురుస్వామి మల్లికార్జున శర్మ, ప్రచార కార్యదర్శి పోలిశెట్టి శివకుమార్ అయ్యప్ప స్వామి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాద కమిటీ ఇంచార్జ్ భీమిశెట్టి శ్రీనివాసరావు, గాదం శెట్టి నాగరాజు, వెంకటేశ్వరరావు, నంబూరి రామలింగేశ్వరరావుతో పాటు వివిధ హోదాలలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్