Magazines

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

15 నిమిషాల క్రితం

better medical services
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

- జిల్లా ఐడీఎస్పీ ప్రాజెక్టు అధికారి డాక్టర్ మోత్యా

- వైద్య సేవలపై ఉన్నత స్థాయి సమీక్ష

నవతెలంగాణ-సత్తుపల్లి 

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా ఐడీఎస్పీ ప్రాజెక్టు అధికారి డాక్టర్ మోత్యా వైద్యాధికారులు వైద్య సిబ్బందిని కోరారు. సత్తుపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం డాక్టర్ మోత్యా వైద్య సేవలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గంగారం, వేంసూరు, లంక సాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అందుతున్న వైద్య సేవలను ఆయన పరిశీలించారు. మాతా శిశు సంరక్షణ సేవలు, వ్యాధి నిరోధక టీకాలు, అలాగే ఎన్సీడీ సేవల తీరుతెన్నులపై కూలంకషంగా చర్చించి అధికారులకు తగు సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ రామిశెట్టి అవినాష్, డాక్టర్ పల్లవి, డాక్టర్ సౌమ్యతో పాటు పలువురు సూపర్‌వైజర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్