- మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ
నవతెలంగాణ-సత్తుపల్లి
ఈ నెల 15, 16 తేదీలలో ముదిగొండలో జరగనున్న టీఎస్‌యూటీఎఫ్ ఖమ్మం జిల్లా 7వ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి దొడ్డా ఉమామహేశ్వరరెడ్డి, సత్తుపల్లి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మహాసభల ప్రచార పోస్టర్‌ను ఉమామహేశ్వరరెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ మహాసభలకు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు ప్రజాప్రతినిధులు, మేధావులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. సభలలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల సంక్షేమం, సమస్యల పరిష్కారంపై ప్రధానంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు.15వ తేదీన జరిగే బహిరంగ సభకు (ఓపెన్ సెషన్) ఉపాధ్యాయులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. అలాగే 16వ తేదీన నిర్వహించే ప్రతినిధుల సభలో సత్తుపల్లి మండల ప్రతినిధులందరూ తప్పనిసరిగా పాల్గొని సభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హెచ్. సూరయ్య కె. అశోక చక్రవర్తి పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)