Magazines

పెన్షన్లు పెంచకుండానే పండగేలా.?

19 నవంబర్, 2026

brs
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 

గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయకుండా పెన్షన్ల పండుగ చేసుకోవడం సిగ్గుచేటని భీంగల్ బీఆర్ఎస్ మండలాధ్యక్షులు దొనకంటి నర్సయ్య అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..6 గ్యారంటీలు, 420 హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని స్పష్టం చేశారు. అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే మేనుఫెస్టోను పూర్తి చేస్తామని నమ్మబలికి, మూడేండ్లయినా పూర్తి చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఇందిరామ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం ట్యాగ్ లైన్ తో పరిపాలన చేతపట్టి, ప్రజల సొమ్మును ఢిల్లీకి మూటలు మోసుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


మహిళలకు రూ.2500, తులం బంగారం, యువతులకు స్కూటీలు, నిరుద్యోగ భృతి రూ.4000, రైతు భరోసా 15000/-, పంట బీమా, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, దివ్యాంగులకు చేయూత పెన్షన్లు భారీగా పెంచుతామని చెప్పిన రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక అన్నిటినీ తుంగలో తొక్కారని ఎద్దేవా చేశారు.


కేసీఆర్‌ ఇచ్చిన పెన్షన్లు రూ.4000/-లకు బదులుగా రూ.6000/- ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేసిన తర్వాత పెన్షన్ల పండగ చేసుకోండని హితవు పలికారు. లేదంటే గ్రామాల్లో మిమ్మల్ని ప్రజలే నిలదీసి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి చౌటుపల్లి రవి,మాజీ కాప్షన్ మోయీజ్,కౌన్సిలర్లు భగత్, నీలం రవి, బోదిరే నర్సయ్య, మాణిక్యాల శ్రీనివాస్, డిష్ గంగాధర్,పర్స నవీన్, ఎంఏ సుర్జిల్,మూత అశోక్, రాగి రాజు, పతాని లింబాద్రి, ఎంఏ అజీజ్, మూత లింబాద్రి, బొట్ల రామకృష్ణ, శ్రీరామ్ భూమేశ్వర్, మోర్తాడ్ బద్రి, జీసస్, అవేజ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్