- పలు వార్డుల్లో పింఛన్ మంజూరు పత్రాలను అందించిన మున్సిపల్ చైర్‌పర్సన్
నవతెలంగాణ-సత్తుపల్లి
అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ చైర్‌పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్ పేర్కొన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని 18, 19, 20, 22, 23 వార్డుల్లో చైర్ పర్సన్ రెహానా కమల్ ఆధ్వర్యంలో ఇంటింటికీ 'చేయూత' పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొత్తగా మంజూరైన పింఛన్ పత్రాలను లబ్ధిదారులకు అందజేసి భరోసా కల్పించారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, అర్హులైన వారందరికీ దశలవారీగా పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ కమల్ పాషా, కౌన్సిలర్లు విరివాడ అపర్ణ, పర్సా మానస, కర్నాటి విజయకుమారితో పాటు స్థానిక నాయకులు విరివాడ నాగభూషణం, యూనిస్, గజ్జల శ్రీను, వెంకటేశ్వరరెడ్డి, యాకూబ్, రాయల కోటేశ్వరరావు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)