Magazines

కరాటే విజేతలకు బహుమతులు అందజేత 

24 నిమిషాల క్రితం

karate winners
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌను

ఏపీలోని కాకినాడలో జరిగిన నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో తెలంగాణ బిడ్డలు గెలుపొంది యాదాద్రి భువనగిరి జిల్లాకు మంచి పేరు తెచ్చారని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. ఈ మేరకు గోల్డ్ మెడల్ పొందిన బి. భావన, జోయల్ రాజ్, సమీర్, అభిరామ్ రెడ్డి సిల్వర్ మెడల్ తేజపాల్ రెడ్డి బ్రాంజ్ మెడల్ హన్నికా ప్రిన్సీ, ఆదిత్య, చరణ్‌లను ఆయన అభినందించారు. అనంతరం విజేతలను ఘనంగా సన్మానించి, బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌లో గెలుపొంది నియోజకవర్గానికి పేరు తీసుకురావడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్ పర్సన్ బిజనీ బాలమణి భాస్కర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ  మాజీ  అధ్యక్షులు ఎజాజ్, కుల్ల నరసింహులు, పిక్క శ్రీనివాస్, ఏం డి రఫీ, మార్క్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్