Magazines

ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. కేసులు నమోదు

8 నిమిషాల క్రితం

Clashes
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - అశ్వారావుపేట

గోల్డ్ లోన్ వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, అశ్వారావుపేట పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. ఎస్ఐ బి. సాయి కిషోర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వారావుపేట మున్సిపాలిటీ మంగలి బజారుకు చెందిన లింగిశెట్టి సుబ్రహ్మణ్యం తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ ఇప్పిస్తానని నమ్మబలికి కొందరి వద్ద బంగారం తీసుకొని, అధిక మొత్తంలో రుణాలు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో గతంలో కేసు కూడా నమోదైంది.


ఈ నేపథ్యంలో బాధితులుగా పేర్కొన్న కడియాల జ్యోతి, లింగిశెట్టి విజయలక్ష్మి ఈ విషయమై మంగళవారం సుబ్రహ్మణ్యాన్ని నిలదీసేందుకు వెళ్లారు. దీంతో సుబ్రహ్మణ్యం సోదరుడు లింగిశెట్టి ప్రవీణ్ కుమార్, అతని అక్క కోపర్తి గోవర్ధిని, తల్లి లింగిశెట్టి విజయకుమారిలతో వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనపై ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్