Magazines

ఎల్లలు దాటిన అభిమానం

9 నిమిషాల క్రితం

Putta Madhukar
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

చేతిపై పుట్ట మధన్న టాటూ

అభిమానం చాటిన మైదం కోటేష్

నవతెలంగాణ - మ ల్హర్ రావు

రాజకీయాలు సాధారణంగా సభలు, నినాదాలు, ప్రచారాలతోనే కనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు అవి గుండెల్లో నిలిచిపోయే భావోద్వేగాలుగా మారుతాయి. మంథని నియోజకవర్గం రామగిరి మండలంలోని ఆదివారంపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ యువనాయకుడు మైదం కోటేష్  చేసిన పని ఇప్పుడు అదే భావోద్వేగానికి ప్రతీకగా మారింది.


మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పై ఉన్న అపారమైన అభిమానాన్ని మాటలతో కాదు… నినాదాలతో కాదు… చేతి పై చెక్కించుకున్నాడు. శాశ్వతంగా ఉండాలన్న ఉద్దేశంతో అభిమాన నాయకుడి పేరును టాటూ రూపంలో చేతి పై రాపించుకొని తన అభిమానాన్ని చాటుకున్నాడు.


మైదం కోటేష్ మాటల్లో చెప్పాలంటే –“పుట్ట మధూకర్ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. మా లాంటి యువతకు ధైర్యం ఇచ్చిన మార్గదర్శి.”గ్రామంలో ఈ విషయం తెలిసినప్పటి నుంచి యువతలోనే కాదు, పెద్దల మధ్య కూడా చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల పట్ల యువతలో తగ్గిపోతున్న ఆసక్తి మధ్య, ఒక యువకుడు ఇలా తన అభిమానాన్ని శాశ్వత గుర్తుగా మలచుకోవడం చాలామందిని భావోద్వేగానికి గురిచేస్తోంది. ఇది కేవలం ఒక టాటూ కాదు ఇది ఒక యువకుడి నమ్మకం, ఒక నాయకుడిపై ఉన్న విశ్వాసం, రాజకీయాలకు మానవీయ కోణం ఇప్పటికీ బతికే ఉందని చెప్పే మౌన సందేశం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్