Magazines

కొయ్యూరులో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

12 నిమిషాల క్రితం

Karthika Pournami
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

మండలం కొయ్యుర్ గ్రామపంచాయతీ పరిధి అటవీప్రాంతంలో ఉన్న పురాతన పరమేశ్వరస్వామి ఆలయాల్లో కార్తీక పౌర్ణమి వేళా ఆధ్యాత్మికత వెల్లువిరిసింది. సందర్శకులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం నైనా గుల్ల పరమేశ్వర స్వామి ఆలయాలు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సహకారంతో సుందరంగా తీర్చిదిద్దుతామని గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ తెలిపారు. కార్తీక పౌర్ణమి మహా పర్వదినాన్ని పురస్కరించుకొని కొయ్యూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పురాతన మహిమాన్వితమైన శ్రీ నైనా గుళ్ళో మంగళవారం ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు.


తెల్లవారుజాము నుండే భక్తులు    స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక అర్చనలు దీపారాధనలు నిర్వహించారు గుడి ప్రాంగణం మొత్తం భక్తి భావంతో భజనలతో మంత్రోచ్చారణలతో మార్మోగిపోయింది. గ్రామ శ్రేయస్సు కోసం సర్పంచ్ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్  మాట్లాడుతూ.. ఈ పురాతనమైన నైనా గుళ్ళు కొయ్యూరు మానేరు పరవాక ప్రాంతంలో దట్టమైన ప్రకృతి వనాల మధ్య, ఎంతో ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణంలో కొలువై ఉంది.


ఇక్కడికి రాగానే మనసుకు ఎంతో ప్రశాంతత ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ఇక్కడ ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటుందన్నారు. ఇంత మహిమ గల ఈ నైనా గుళ్ళో శివ దర్శనం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి రాబోయే రోజుల్లో మంత్రి సహకారంతో ఈ నైనా గుళ్ళను మరింత సుందరంగా మరింత అభివృద్ధి చేసి తీర్చిదిద్దుతామని, పర్యావరణాన్నికాపాడుతూ మొక్కలు నాటే కార్యక్రమం ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి  దోహదపడుతుందన్నారు.


ఈ కార్యక్రమంలో కొయ్యూరు నైనా గుళ్ళ కమిటీ సభ్యులు, హనుమాన్ దేవాలయ కమిటీ సభ్యులు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్